మత్తు విముక్తికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత్తు విముక్తికి చర్యలు

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్‌: గోదావరిఖని ప్ర భుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్‌ సెంటర్‌ ఏసీపీ రమేశ్‌, సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి డీసీపీ రాండ్డి గురువారం సందర్శించారు. మత్తు పదార్థాలకు గు రై చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు, పురోగతిపై వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ఆధ్వర్యంలో అందించి న క్యారమ్‌, చెస్‌ బోర్డులు తదితర ఆటవస్తువులను పంపిణీ చేశారు. మార్కండేయకాలనీ ఉ ప్పర సంఘం భవనంలో జూనియర్‌ కాలేజీల విద్యార్థులకూ అవగాహన కల్పించారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ హిమబింద్‌సింగ్‌, ఆర్‌ఎంఓవో కృపాభాయి పాల్గొన్నారు.

భూములెలా లాక్కుంటారు?

పెద్దపల్లిరూరల్‌: ప్రజావసరాల కోసమని బైపా స్‌ రోడ్డు నిర్మించేందుకు మా భూములను మా కు చెప్పకుండానే మీ ఇష్ట ప్రకారం లాక్కోవ డం ఏమిటని నిర్వాసితులు గురువారం పెద్దకల్వల వద్ద నిరసనకు దిగారు. గతంలో బైపాస్‌ రోడ్డు కోసం చేసిన సర్వేను పక్కన బెట్టి ఇప్పు డు సారవంతమైన భూముల్లో వ్యవసాయం చే సుకుంటున్న తమను ఇబ్బంది పెట్టేలా డిజైన్‌ మార్చడం సమంజ సంకాద న్నారు. తమకు అన్యాయం జరిగేలా చూడవద్దని వారు అధికారులను వేడుకున్నారు.

శిశు మరణాలు తగ్గించాలి

పెద్దపల్లి: నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా సిబ్బంది, అధికారులు పనిచేయాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ కుమార్‌ సూచించా రు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో న వజాత శిశు మరణాలపై గురువారం సమీక్షించారు. గర్భిణులను ఎర్లీ రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ గుర్తించి తగిన ప ర్యవేక్షణ చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు శ్రీరాములు, కిరణ్‌ కుమార్‌, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, ప్రోగ్రామ్‌ అధికారులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల గైనకాలజిస్ట్‌లు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘మోడల్‌’ విద్యార్థి ప్రతిభ

రామగుండం: తెలంగాణ మోడల్‌ యునైటె డ్‌ నేషన్స్‌ డెలిగేట్‌ విభాగంలో స్థానిక మోడల్‌ స్కూల్‌ విద్యార్థి బి.అద్వైత్‌ రాష్ట్రస్థాయిలో ప్ర థమ బహుమతి సా ధించాడని ప్రిన్సిపల్‌ సదానందం యాదవ్‌ తెలిపారు. బహుమతి సాధించడంపై స్కూల్‌ ఎ డ్యుకేషన్‌ డైరెక్టర్‌ నికోలస్‌ అభినందించారు. మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు.

‘పోలీసులు వేధిస్తున్నారు’

పెద్దపల్లి: వెండి, బంగారం వర్తక సంఘం స భ్యులను పోలీసులు వేధించకుండా కాపాడా లని స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి రాఘవచారి కోరారు. గురువారం కలెక్టర్‌ కోయ శ్రీహర్షను కలిసి వినతిపత్రం అంద జేశారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విన్నవించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి వెంకటస్వామితోపాటు రంగు శ్రీనివాస్‌, కట్ట రమే శ్‌, దేవరకొండ రాజు, కట్ట సతీశ్‌ పాల్గొన్నారు.

టెన్త్‌లో 93శాతం ఉత్తీర్ణత

పెద్దపల్లి: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయని డీఈవో శార ద తెలిపారు. 172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 160 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. జిల్లాలో ఉత్తీర్ణత 93.02 శాతంగా నమోదైందని వివరించారు.

27న మెగా జాబ్‌మేళా

పెద్దపల్లి: ఈనెల 27న వరంగల్‌ కాకతీయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్స్‌లో ఉదయం 8గంటల నుంచి మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్‌ తెలిపారు. యువత హాజరు కావాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement