జ్యోతినగర్: ప్రత్యేక సమగ్ర సవరణ–2026 విజ యవంతానికి బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం మేయర్ మ హంకాళి స్వామి కోరారు. ఎన్టీపీసీ మిలీనియం హా ల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు, ఓటర్లకు గణనపత్రాల పంపిణీ, పొరపాట్లు లేకుండా ఫామ్స్ పూరించడంపై బూత్‌స్థాయి అధికారులకు గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మాట్లాడారు. ప్రతీ బీఎల్‌వో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఫారాల పంపిణీ చేసి, వివరాలను సేకరించడంతోపాటు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ.. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసే విధానం, ఓటర్లతో పొరపాట్లు లేకుండా పూరించడం, అవసరమైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయడం వంటి అంశాలపై సూచనలు చేశారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, తహసీల్దార్ రవీందర్‌రావుతోపాటు బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా సవరణ
మంథని: ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని మంథని రెవె న్యూ డివిజనల్ అధికారి సురేశ్ సూచించారు. మంథని మున్సిపాలిటీలో ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ కార్యక్రమాన్ని మండల రెవెన్యూ అధికా రి అరిఫొద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఓటుహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కనీస వేతన జీవోను సవరించాలి
జ్యోతినగర్: కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవో ను సవరించి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. గురువారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని కేంద్ర కార్మి క శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కమిషనర్ యూసుఫ్‌కు వినతిపత్రం అందించారు. ముత్యంరావు మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని వేలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమారస్వామి, నాయకులు బిక్షపతి, లక్ష్మారెడ్డి, యాసీన్, ఉపేందర్, యాకుబ్, రాఘవరెడ్డి పాల్గొన్నారు.


