ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

కోల్‌సిటీ: గోదావరిఖని జవహర్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలుల ధాటికి చెట్టు కొ మ్మలు విరిగి ఇంటిపై పడింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో వృద్ధురాలు, ఆమె ఇద్దరు బిడ్డ లు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక సింగరేణి స్టేడియం సమీపంలోని హోటల్‌ నిర్వహించే పారుపెల్లి ఈశ్వరమ్మ, ఆ హోటల్‌పైన ఇనుప రేకుల షె డ్డును ఏర్పాటు చేసుకుంది. తన బిడ్డలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుత్‌ తీగలపై చెట్టు కొమ్మలు విరిగి పడటంతో భారీశబ్దం వచ్చింది. భయంతో బయటకు వచ్చిన ఈశ్వరమ్మ.. హై దరాబాద్‌లో నివసిస్తున్న తన మనవడికి ఫోన్‌చేసి విషయం చెప్పింది. అతడు ఇంటి సమీపంలో ఉ న్న వ్యక్తికి సమాచారం అందించి అప్రమత్తం చేశాడు. సకాలంలో స్పందించిన స్థానికుడు సైతం విద్యుత్‌ శాఖ అధికారులను వెంటనే అప్రమత్తం అయ్యేలా సమాచారాన్ని చేరవేశారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది సరఫరాను నిలిపివేశారు. బుధవారం ఉదయం చెట్టు కొమ్మలను తొలగించారు.

వర్షం వస్తే రహదారులు జలమయం

నగరంలోని ప్రధాన రహదారులు వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి గాంధీనగర్‌తోపాటు మార్కండేయకాలనీ ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల కు ఇరువైపులా అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీలతో నీరు గంటల తరబడి నిలిచిపోతోందని పేర్కొంటున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement