99రోజుల కార్యాచరణపై పుస్తకం | - | Sakshi
Sakshi News home page

99రోజుల కార్యాచరణపై పుస్తకం

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

● రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ● కలెక్టర్‌ శ్రీహర్ష, అధికారులతో సమావేశం

పెద్దపల్లి: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను ఆకర్షణీయమైన పుస్తకంగా రూపొందించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి 99 రోజుల కార్యక్రమం అమలుపై బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వెంకట్‌రెడ్డి, వివిధ శా ఖల అధికారులు హాజరయ్యారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, ఎలక్ట్రానిక్‌ మీడియా కథనా లు, వార్తా క్లిప్పింగ్‌లను భద్రపరచాలని సూచించారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ మార్చి నుంచి ఈనెల 12వ తేదీ వరకు 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని అన్నారు.

దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి

రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని లోకేశ్‌కుమార్‌ ఆదేశించారు. భూభారతి, ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. కులం, ఆదాయం, నివాసం తదితర సర్టిఫికెట్లను 30 రోజుల్లోగా మంజూరు చేయాలని అన్నారు. సాదాబైనామాలను జూలై ఐదో తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాసేవల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్‌, కలెక్టర్‌ ఏవో ప్రకాశ్‌, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement