‘నీట్‌’ నిర్వహణలో కేంద్రం విఫలం | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ నిర్వహణలో కేంద్రం విఫలం

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని: నీట్‌ పరీక్షణ నిర్వహణలో కేంద్ర ప్ర భుత్వం విఫలమైందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్‌ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న లోపాలు, విద్యార్థులపై మానసిక ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్ష రాయలేకపోతున్నాననే ఆవేదన తో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి కు టుంబాలు నీట్‌ పరీక్షలపై అనేక ఆశలు పెట్టుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు అప్పులు చేసి, పొలాలు అమ్ముకుని తమ పిల్లలను కార్పొరేట్‌ వి ద్యాసంస్థల్లో చదివిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. విద్యార్థుల ను, వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నగర మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్‌ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాకినాడకు బస్సు ప్రారంభం

గోదావరిఖనిటౌన్‌: గోదావరిఖని నుంచి కాకినాడకు నడిచే ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గోదావరిఖని నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement