ప్రమాదాలు లేని సింగరేణిగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు లేని సింగరేణిగా తీర్చిదిద్దాలి

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

అప్రమత్తంగా ఉండాలి

గోదావరిఖని: ప్రమాదాల్లేని సింగరేణిగా తీర్చిదిద్దేందుకు ప్రతీఒక్కరు రక్షణతో పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఎల్‌వీ సూర్యనారాయణ కోరారు. బుధవారం ఆర్జీ–2 ఏరియాలోని ఎన్‌సీవోఏ క్లబ్‌లో ఏర్పాటు చేసిన రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రతలో ఎక్కడా రాజీ పడకుండా, యంత్రాల పనిగంటలను పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలన్నారు. కోల్‌ ఇండియాతో పోల్చితే సింగరేణిలో బొగ్గు ధరలు ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌లో పోటీ పెరుగుతోందని చెప్పారు. యాజమాన్యం నిర్దేశించిన రక్షణ సూత్రాలను పాటిస్తూనే ఉత్పత్తి పెంచాలని సూచించారు. డీఎంఎస్‌ సాగేశ్‌కుమార్‌, అనిల్‌ టొప్పో, కౌశిక్‌సేన్‌గుప్తా, దీపక్‌కుమార్‌, ప్రభాకర్‌, కోమల్‌చౌదరి, ఆర్జీ–2 జీఎం వెంకటయ్య, కార్పొరేట్‌ సేఫ్టీ జీఎం సాయిబాబు, రామగుండం రీజియన్‌ జీఎం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌: వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదా ల బారిన పడకుండా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రాపెల్లి రాముడు, ఎస్సై వెంకటేశ్‌, ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ సూచించారు. ఆ యా ప్రదేశాల్లో రైతులు, ప్రజలు భద్రత కోసం గమనించి పనులు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకు ప్రమాదం సంభవిస్తుందన్నారు. గృహిణులు ఇళ్ల వద్ద బట్టలు ఆరవేసే తీగలకు, సిటీ కేబుల్‌ వైర్లకు, సర్వీసు వైర్ల ద్వారా విద్యుత్‌ సరఫరా అయి షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండవద్దని తహసీల్దార్‌ హెచ్చరించారు. వరదలతోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement