పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంచుతాం | - | Sakshi
Sakshi News home page

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంచుతాం

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

జూలపల్లి: పర్యావరణ పరిరక్షణతోపాటు భవిష్య త్‌ అవసరాలను తీర్చడంలో పునరుద్పాదక ఇంధన వనరులు కీలకపాత్ర పోషిస్తాయని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. కాచాపూర్‌లో ని ర్మిస్తున్న 2.2 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, నిర్వహణ, గ్రిడ్‌కు అనుసంధానంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్‌ఈ గంగాధర్‌, డీఈ (ఆపరేషన్‌) రాజబ్రహ్మచారి పాల్గొన్నారు.

15లోగా ఎస్‌ఈ ఆఫీస్‌ భవనం పూర్తిచేయాలి

పెద్దపల్లిరూరల్‌: ఎన్పీడీసీఎల్‌ పెద్దపల్లి సర్కిల్‌ కార్యాలయ భవన నిర్మాణాన్ని జూలై 15లోగా పూర్తిచేయాలని సీఎండీ వరణ్‌రెడ్డి సూచించారు. రాఘవపూర్‌లో చేపట్టిన సర్కిల్‌ కార్యాలయ భవనాన్ని ఎస్‌ఈ గంగాధర్‌ తదితర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. కస్టమర్లతో మర్యాదగా వ్యహరించాలని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement