ప్రైవేట్ స్కూల్ ఆవరణలో పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మవద్దు. యాజమాన్యాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఫీజుల విషయంపై ఇప్పటికే యాజమాన్యాలకు సూచనలు చేశాం. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతీ స్కూల్‌లో పేరెంట్స్ కమిటీలు నియమించేలా చర్యలు తీసుకుంటాం.
– శారద, డీఈవో
చర్యలు తీసుకోవాలి
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో బుక్‌స్టాళ్లను తలపించేలా స్టడీ మెటిరీయల్ విక్రయిస్తున్నారు. యజమాన్యాలు ధరలు నిర్ణయించి పైసా తగ్గించడంలేదు. వసతులు కల్పించకుండా ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు చేపట్టకపోవడం విచారకరం. నిబంధనలు అతిక్రమించే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి.
– రాజశేఖర్, జిల్లా కన్వీనర్,ఏబీవీపీ


