అధికారిక కార్యక్రమంలో సర్పంచ్‌ కొడుకు! | - | Sakshi
Sakshi News home page

అధికారిక కార్యక్రమంలో సర్పంచ్‌ కొడుకు!

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

విత్తన మేళాలో సర్పంచ్‌ దాగేటి రాజేశ్వరి కుమారుడు ఉదయ్‌కుమార్‌ వేదికపై కూర్చోవడం చ ర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రొటో కాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించ గా వేదికపై ఆశీనులయ్యారు. అనంతరం వచ్చి న సర్పంచ్‌ కుమారుడు ఉదయ్‌కుమార్‌ను మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఆహ్వానించడంతో ఆయన కూడా స్టేజీపై కూర్చున్నారు. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో ఏ అధికారం లేనివ్యక్తి వేదికపై కూర్చోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించాలని, వేదికపై కూర్చునే వారి ఎంపికలో అధికారిక హోదాకు ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంత్రి ఆహ్వానం మేరకే ఆయన వేదికపైకి వెళ్లారని, ఇందులో వివాదం ఏమీ లేదని మరికొందరు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement