గోదావరిఖని: బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒ ప్పందం చర్చలు ప్రారంభించాలని కార్మిక సంఘా ల జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్‌ప్రసాద్, తుమ్మల రాజారెడ్డి, సారయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో జూలై 1న నిర్వహించనున్న కార్యాచరణపై కార్యాచరణ సమావేశం నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కె.స్వామి, రంగు శ్రీను, నరసింహారెడ్డి, ధర్మపురి, రాజమౌళి, అనిల్‌రెడ్డి, తొడుపునూరి రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


