సన్నరకానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సన్నరకానికి ప్రాధాన్యం

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

సుల్తానాబాద్‌రూరల్‌: సన్నరకం వరి సాగు చే సేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు సూచించారు. కాట్నపల్లి రైతువేదికలో మంగళవారం సన్నరకం వరి వి త్తన మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. ఏడు రకాల వరి విత్తనాలను నాటుకోవాల ని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, ఏ ఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, సర్పంచులు ఓగు ల పూజ, తిరుమల్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నమని రాజిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీనివాస్‌, మండల వ్యవసాయ అధికా రి పైడితల్లి, ఏఈవో పద్మ పాల్గొన్నారు.

విలువలు.. క్రమశిక్షణే ముఖ్యం

సుల్తానాబాద్‌రూరల్‌: విద్యార్థుల్లో మంచి విలు వలు, క్రమశిక్షణ ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీర్చిదిద్దితే మత్తు పదార్థాల బా రిన పడరని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝూ అన్నారు. గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవంలో సీపీ మాట్లాడారు. సీఐ రంజిత్‌రావు, నార్కోటిక్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌, ఎస్సైలు చంద్రకుమార్‌, మల్లేశ్‌, ప్రిన్సిపాల్‌ మంజుల, హెచ్‌ఎం కవిత ఉన్నారు.

పోలీస్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ తనిఖీ

గోదావరిఖని: పోలీస్‌ కమిషనరేట్‌లోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి సిబ్బంది వివరాలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది విధులు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు.

ఆ భూముల్లో సేద్యం చేయొద్దు

రామగిరి: మేడిపల్లి భూముల్లో సేద్యం చేయకూడదని మంథని ఆర్వీవో సురేశ్‌ సూచించా రు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ట్రాక్టర్‌ సంఘం నాయకులతో సమా వేశం నిర్వహించారు. మేడిపల్లి శివారులోని భూములు ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం అప్పగించామని తెలిపారు. అందులో ట్రాక్టర్‌తో సేద్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తహసీల్దార్‌ సుమన్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌, జీపీవో వెంకటేశ్వర్లు, ట్రాక్టర్‌ అసోసియేషన్‌ సభ్యులు నాడెం లింగయ్య, శ్రీనివాస్‌, రాజయ్య, సురేశ్‌ పాల్గొన్నారు.

ప్రతీ విద్యార్థి సోల్జరే

కమాన్‌పూర్‌(మంథని): డ్రగ్స్‌ నిర్మూలనలో ప్ర తీవిద్యార్థి యాంటి డ్రగ్స్‌ షోల్జర్స్‌గా ముందుకురావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించా రు. డ్రగ్స్‌ నిర్మూలనపై స్థానిక జెడ్పీ హైస్కూల్‌ లో మంగళవారం అవగాహన కల్పించారు. వి ద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, టూటౌన్‌ సీఐ ప్రసాదరావు, కమాన్‌పూర్‌ ఎస్సై ప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

న్యూఢిల్లీకి సామాజిక సేవకుడు

ఎలిగేడు: జాతీయ స్థాయి సామాజిక సేవకులు (ఆల్‌ ఇండియా యువజన అవా ర్డు గ్రహీతల సంఘం) ఈ నెల 26న న్యూ ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజ రు కావాలని ధూళికట్టలోని కొండ రవియాదవ్‌కు ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిజాతీయ యువజన అవార్డు అందుకున్న వ్యక్తి రవియాదవ్‌. కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగే సమావేశంలో ఆయనకు జాతీయ గౌరవ్‌ సమ్మాన్‌ సర్టిఫికెట్‌ అందిస్తారని ఆ సంఘం అధ్యక్షుడు జావేంద్‌ జమేదర్‌ వెల్లడించారు. ఈమేరకు ఆయన ఆహ్వానం పంపించారు.

ప్రమాద రహిత ఉత్పత్తి లక్ష్యం

గోదావరిఖని: ప్రమాద రహిత ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని సింగరేణి డైరెక్టర్‌ ఎల్‌వీ సూర్యనారాయణ సూచించారు. మంగళవారం స్థానిక ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ఏరియా 20వ లెవల్‌ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో మాట్లాడారు. కస్టమర్లకు నాణ్యమైన బొ గ్గు అందించాలని చెప్పారు. గతే డాది జరిగిన ప్రమాదాలు, తీసుకున్న చర్యలు, భవిష్యత్‌ స వాళ్లు, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. డీఎంఎస్‌ నగేశ్‌కుమార్‌, సేఫ్టీ జీఎం ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement