కాల్వశ్రీరాంపూర్: వివిధ గ్రామాల్లో పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూముల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో కలెక్టర్ ప్రభుత్వ భూములపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీవో దివ్వదర్శన్‌రావుకు సూ చించారు. ఈజీఎస్ ద్వారా చేపట్టిన రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పారు.
వేగవంతంగా ప్రభుత్వ భూముల సర్వే
ముత్తారం: అర్హులైన పేదలకు భూపంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూముల సర్వేను వేగవంతం చే యాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఓడెడ్ పంచాయతీ వెంకటేశ్వరపల్లిలో సీలింగ్ భూములను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌ఐ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.
భూవివాదాల పరిష్కారానికి కార్యాచరణ
పెద్దపల్లి: జిల్లాలో అటవీ, రెవెన్యూ భూముల వివాదాల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లోని రీచ్‌ల నుంచి ఇసుక రవాణా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, ఇన్‌చార్జి డీఎఫ్‌వో నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి
ధర్మారం: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు వారి సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. నందిమేడారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.


