ధర్మారం: రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్ర భుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. స్థానిక గ్రామపంచా యతీ కార్యాలయంలో మంగళవారం విత్తనమేళా ను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, యాసంగిలో ధా న్యం, మొక్కజొన్న దిగుబడులు అధికంగా వచ్చినా అధికారులు సమన్వయంతో రికార్డుస్థాయిలో కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు చేసిన నాలుగు రో జుల్లోపే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేశారని తెలిపారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలు మాత్రమే సాగు చేసి బోనస్ పొందాలని మంత్రి సూచించా రు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాకు 25 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 21 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు వివరించారు. విద్యుత్ షాక్‌తో మరణించిన కుటుంబాలకు మంత్రి పరి హారం చెక్కులు అందించారు. మార్కెట్ కమిటీ చై ర్మన్ లావుడ్య రూప్లానాయక్, ఉపసర్పంచ్ మల్లేశం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరె డ్డి, నాయకులు ఓరం చిరంజీవి, కాడే సూర్యనారా యణ, పాలకుర్తి రాజేశంగౌడ్, బద్దం అజయ్‌పాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


