కార్మికుల హక్కుల సాధన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కుల సాధన లక్ష్యం

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

● కనీస వేతన సలహా మండలి ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్‌

రామగిరి: సింగరేణి కార్మికుల హక్కుల సాధన ధ్యేయమని ఐఎన్‌టీయూసీ నేత, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌ బి.జనక్‌ప్రసాద్‌ అన్నారు. ఆర్జీ–3 ఓసీపీ–2లో ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మెడికల్‌ బోర్డు వ్యవస్థను పునరుద్ధరించేందుకు యాజమాన్యంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించిన ఘనత ఐఎన్‌టీయూసీకే దక్కుతుందన్నారు. సింగరేణి భవిష్యత్‌, పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఐఎన్‌టీయూసీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, నాయకులు ధర్మపురి, దాస్‌, గడ్డం తిరుపతి యాదవ్‌, రామారావు, ఉయ్యాల కుమారస్వామి, రామిడ్ల మనోహర్‌, కేఎన్‌ చారి, మడ్డి రాజ్‌కుమార్‌, సందెల కుమార్‌స్వామి, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతు న్న పన్నూర్‌లోని ఐఎన్‌టీయూసీ నేత ఉడుత శంకర్‌ యాదవ్‌ తండ్రి ఉడుత రాయమల్లును జనక్‌ ప్రసా ద్‌ పరామర్శించారు. ఆయన వెంట నాయకులు ధర్మపురి, దాస్‌, కోట రవీందర్‌రెడ్డి, బండ కిరణ్‌రెడ్డి, మల్లూరి మల్లారెడ్డి, జాగరి రజిత ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement