బైపాస్‌ పనులకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌ పనులకు సహకరించండి

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

● కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ప్రతిపాదనలు ఇవ్వండి ● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

పెద్దపల్లిరూరల్‌/పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో చేపట్టి న బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో అడ్డుగా వచ్చే విద్యుత్‌ స్తంభాలను గుర్తించి తొలగించాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌, సహకారశాఖ అధికారులతో సోమవారం వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. కొత్తగా విద్యుత్‌ సబ్‌స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఎస్‌ఈ గంగాధర్‌కు ఆయన సూచించారు. వానాకాలంలో ఈదురుగాలులు వీచే ప్రమాదముందని, రైతులు, వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు.

రైతులకు సేవలందించాలి

సాగు సమయంలో రైతులకు అవసరమైన సేవలు అందించాలని జిల్లా సహకారశాఖ అధికారి శ్రీమా ల, సింగిల్‌విండోల సీఈవోలకు విజయరమణారా వు సూచించారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలపై గట్టి నిఘా ఉంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రాజబ్రహ్మచారి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement