గోదావరిఖనిటౌన్: గోదావరిఖని అదనపు జి ల్లా న్యాయమూర్తిగా నియమితులైన కోట్ల లా వణ్య బాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏసీపీ రమేశ్, గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ జడ్జికి పుష్పగుచ్ఛం శుభాకాంక్షలు తెలిపారు. ఏజీపీ శాంతన్‌కుమార్, న్యాయవాదులు కుడిది వెంకటేశ్, ముచ్ఛకుర్తి కుమార్, చెలికల పద్మజ, రవీందర్, జాగిరి రాజయ్య, ప్రసన్న, అంజలి, షానవాజ్, తిలక్, రమేశ్ పాల్గొన్నారు.
మొహర్రం వేడుకలకు ఏర్పాట్లు
పెద్దపల్లి: మొహర్రం వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులు, క మిటీ సభ్యులతో సమీక్షించారు. భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా మినీహెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మసీదుల పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆర్డీవో గంగయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నరేశ్‌కుమార్‌నాయుడు, వైద్యాధికారి ప్రమోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, వెంకటేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవలు ఆదర్శం
జ్యోతినగర్: లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డులోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది (డిస్ట్రిక్ట్ 320– జీ) 2026–27 సంవత్సరానికి నూతన కార్యవ ర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన లయన్స్ క్లబ్ ఆ ఫ్ గోదావరిఖని శతాబ్ది అధ్యక్షుడిగా మహేందర్‌గౌడ్ మాచిడి, కార్యదర్శిగా పైడ సాయికుమా ర్, ట్రెజరర్‌గా శ్రీకాంత్‌గౌడ్ కొండాతోపాటు కార్యవర్గ సభ్యులతో ప్రమాణం స్వీకారం చే యించారు. ఇన్‌స్టాలేషన్ అధికారిగా ఆర్.విజయ, ఇండక్షన్ అధికారిగా మేడిశెట్టి గంగాధర్ వ్యవహరించారు. కజాపురం జయప్రద – రాజేందర్, మాచిడి రాజుగౌడ్, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఒల్లాల కృష్ణహరి, క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరి ఆనందం, రీజియన్ చైర్‌పర్సన్ సోమారపు లావణ్య, జోన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి తానిపర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎప్‌సెట్ సర్టిఫికెట్ల పరిశీలన
గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈఏపీసీఈటి–2026 అభ్యర్థుల స ర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రశాంతంగా సాగుతోంద ని ప్రిన్సిపాల్ మనోహర్ తెలిపారు. వెరిఫికేష న్‌కు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్, ర్యాంక్ కార్డుతోపాటు అన్ని ధ్రువీకరఫ పత్రాలు వెంట తీసుకు రావాలని సూచించారు. వెరిఫికేషన్ అధికారులు ప్రసాద్, రవి, సుధ, రఘుపతి, శ్యాంప్రసాద్, జ్యోతి పాల్గొన్నారు.
మత్తుకు బానిసలు కావొద్దు
పెద్దపల్లిరూరల్: ఉన్నత విద్య అభ్యసించే యు వత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాల కు బానిసలుగా మారి భవిష్యత్‌ను పాడు చే సుకోవద్దని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించా రు. పెద్దకల్వలలోని నోబెల్ హైస్కూల్, గా యత్రీ కాలేజీలో విద్యార్థులకు సోమవారం ఏ సీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు మధుకర్, నరేశ్, రూరల్ ఎస్సై శ్వేతతో కలిసి మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కాలేజీల్లో చదివే యువతకు కొందరు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అంటగట్టేందుకు యత్నిస్తారని తెలిపా రు. గంజాయి విక్రయదారుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని, వివరాలను గో ప్యంగా ఉంచుతామన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించాలని డీసీపీ సూచించారు.


