గోదావరిఖని: బాధితులు నిర్భయంగా కమిషనరేట్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన ప్రజావాణి కార్యమ్రం నిర్వహించారు. ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని సీపీ తెలిపారు. ఫిర్యాదులపై స్పందించిన సీపీ.. సంబంధిత స్టేషన్‌హౌస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై విచారణ జరిపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్ర మంలో అదనపు డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వృత్తి సామర్థ్యం పెంపొందించుకోవాలి
నైపుణ్యం, వృత్తి సామర్థ్యం మరింత పెంపొందించుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్‌కు పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సీపీ అంబర్ కిశోర్ మాట్లాడుతూ, కంప్యూటర్, ఫోరెన్సిక్, సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్‌స్క్వాడ్ ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ–సబోటేజ్ తనిఖీలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో ప్రతిభ కనబర్చాలన్నారు. సత్తాచాటిన వారిని జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు అవకాశం కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


