గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1లో ఆదివారం ఐఎఫ్‌ఎస్ అధికారి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలదేవి పర్యటించారు. సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ బుద్ద ప్రకాశ్‌జ్యోతి సతీమణి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ అయిన సోనిబాలదేవి గోదావరిఖనిలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియాన్ని సందర్శించి అభివృద్ధిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ ఇతర అధికారులున్నారు.
పెద్దపల్లిలో డాగ్‌స్క్వాడ్ తనిఖీలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలో గంజాయి రవా ణా, క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు నిరంతర నిఘాను ముమ్మరం చేశారు. పెద్దపల్లిలోని బస్టాండ్ ప్రాంతంలో గల పాన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో ఆదివారం పోలీసు అధికారులు, సిబ్బంది డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
ఆచార్య జయశంకర్‌ను
ఆదర్శంగా తీసుకోవాలి
మంథని: తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య జయశంకర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని టీపీసీ సీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నా రు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదివా రం మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ని వాళి అర్పించారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జ రిగిన సమావేశంలో ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌వోలకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజంట్లకు పలు విషయాలను వివరించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాద వ్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, ఆర్‌టీఏ సభ్యుడు మంథని సురేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
మడకలో బడిబాట
ఓదెల: మండలంలోని మడకలో ఆదివారం బడిబాట నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పొత్కపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ కోరారు. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో పొత్కపల్లి విద్యార్థులు టాపర్‌గా నిలిచారన్నారు సర్పంచ్ ఆవాల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమృతకిషోర్, రమేశ్ పాల్గొన్నారు.


