మంథని: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించినట్లుగా 33 రకాల సన్న ర రకం వరి వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఆదివారం మంథనిలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ రైతులు అన్నమో రామచంద్రా.. ఏందీ మా బతుకులు అనే దుస్థితికి వచ్చారని వాపోయారు. పంటకు బీమా కడుతానని చెప్పి ఉన్న రైతుబీమాను తీసివేశాడని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7600 మంది రైతులు చనిపోతే ఆ కుటుంబాలకు రైతుబీమా రాకుండా ఆగిపోయందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరువాలన్నారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, జంజర్ల శేఖర్, తరగం శంకర్‌లాల్, పుప్పాల తిరుపతి, కనవేన శ్రీనివాస్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.


