పెండింగ్‌ కేసుల్లో రాజీపడడమే మేలు | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల్లో రాజీపడడమే మేలు

Jun 21 2026 8:16 AM | Updated on Jun 21 2026 8:16 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

పెద్దపల్లిరూరల్‌: పెండింగ్‌ కేసుల్లో ఇరువర్గాలు రాజీపడడమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో అడిషనల్‌ జిల్లా జడ్జి భవాని, జూనియర్‌ జడ్జి మంజుల, డీసీపీ రాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ల ద్వారా 1,984 కేసులు పరిష్కరించినట్టు చెప్పారు. పెద్దపల్లి, నందిమేడారం కోర్టులకు సంబంధించి 725, సుల్తానాబాద్‌లో 543, గోదావరిఖనిలో 519, మంథనిలో 196 కేసులు పరిష్కారం అయ్యాయని వివరించారు. మోటారు వాహన ప్రమాదబీమా కేసులలో రూ.1,14,25,000 చెక్కులను పరిహారంగా అందించినట్టు వివరించారు. పీపీ డొంకెన రవీందర్‌, బార్‌ అసోసియేషన్‌ అధక్ష, ప్రధానకార్యదర్శులు మేకల మల్లేశం, రాచూరి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌తో సమ న్యాయం

పెద్దపల్లి: లోక్‌ అదాలత్‌తో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో మాట్లాడారు. కక్షిదారులు వ్యయ ప్రయాసలకు గురికాకుండా రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్‌, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఏజీపీ దూడం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రాజీయే రాజమార్గం

ధర్మారం(ధర్మపురి): రాజీయే రాజమార్గమని జడ్జి మట్ట సరిత అన్నారు. ధర్మారం మండలం నందిమేడారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో మాట్లాడారు. కక్షిదారులు తమ వివాదాలను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం, శ్రమ ఆదా చేసుకోవచ్చన్నారు. అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, ప్రధానకార్యదర్శి లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement