రామగుండం: ఇరుకై న వీధులను కనీసం ఇరవై అడుగులకు విస్తరించి అంబులెన్స్ రాకపోకలు సాగించేలా తీర్చిదిద్దుతామని నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. శనివారం నగరంలోని 30వ డివిజన్ పరిధి ఖాదర్‌కాలనీ, ఇందిరానగర్, రహ్మత్‌నగర్, భీమయ్యకాలనీ తదితర ఏరియాల్లో పర్యటించారు. వీధుల విస్తరణకు కాలనీవాసులు సహకరించి త్వరగా అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తే రహదారి పనులు చేపడతామన్నారు. కాగా, ఇదే డివిజన్‌లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ స్వగృహం ఉండడం గమనార్హం. కాలనీలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు, పిచ్చి మొక్కల తొలగింపు పనులను దగ్గరుండి పూర్తి చేయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక నిధి రూ.20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగంగా చివరి ఇంటి వరకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయోధ్యసింగ్‌ఠాకూర్, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్, కార్పొరేటర్లు ఇసంపెల్లి అంజులు, సిరిశెట్టి సతీశ్‌గౌడ్, నిమ్మరాజుల రజిని తదితరులున్నారు.
పనులు త్వరగా పూర్తి చేయండి
ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో తహసీల్దార్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై అదనపు కలెక్టర్‌కు తహసీల్దార్ వనజ వివరించారు. ఆర్‌ఐ గౌతం, సిబ్బంది పాల్గొన్నారు.


