రాహుల్‌ గాంధీ పుట్టినరోజు వేడుకలు | - | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ పుట్టినరోజు వేడుకలు

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్దగల గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా జరిపారు. పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కేక్‌ కట్‌చేసి స్వీట్లను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌తోపాటు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

వార్డుల్లో శానిటేషన్‌ డ్రైవ్‌

పెద్దపల్లిరూరల్‌: మున్సిపల్‌ పరిధిలోని వివిధ వార్డుల్లో శుక్రవారం శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. స్థానిక రెండోవార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కౌన్సిలర్‌ పస్తం లక్ష్మి– జంపయ్యతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. 12వ వార్డులో కమిషనర్‌ వెంకటేశ్‌, కౌన్సిలర్‌ జగదీశ్‌తో కలిసి మురుగునీటి కాలువలు శుభ్రం చేసే పనులను పర్యవేక్షించారు. వార్డు ప్రజలకు పలు సూచనలు చేశారు.

స్వచ్ఛ రామగుండం లక్ష్యం

యైటింక్లయిన్‌కాలనీ: స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పనిచేస్తున్నారని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. నగరంలోని 19వ డివిజన్‌లో కార్పొరేటర్‌ మారెల్లి సుశీల–రాజిరెడ్డితో కలిసి మే యర్‌ శుక్రవారం పర్యటించారు. సింగరేణి ఆర్జీ –2, మున్సిపల్‌ అధికారులు ప్రధాన డ్రైనేజీల్లో పూడిక తీయించగా.. మేయర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. కాంగ్రెస్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ మారెల్లి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పెద్దపల్లి: మున్సిపల్‌ కార్మికుల సమస్యలను త క్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా గౌ రవ అధ్యక్షుడు ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. సుల్తానాబాద్‌లో మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని, కనీస వేతనం నెలకు రూ.26 వేలు నిర్ణయిస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలు విస్మరించిందని ఆయన విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు చేపడతామని, అయినా, పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన కార్మికులను కోరారు. నాయకులు పాక మహేశ్‌, తాండ్ర అంజయ్య, న్యాతరి రమేశ్‌, ఆరేల్లి సురేశ్‌, మాతంగి రాజమల్లు, మహంకాళి మల్లేశ్‌, శ్రీనివాస్‌, చిలుముల రామ్మూర్తి, న్యాతరి లక్ష్మి, లత, ఓదెలు, మధు, నర్సింగం పాల్గొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాల బస్సుల అడ్డగింత

పాలకుర్తి: కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను స్థానికులు అడ్డగించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, దీనిదృష్ట్యా బడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పంచాయతీ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది. కాగా, మూడురోజులపాటు ఈసాలతక్కళ్లపల్లి గ్రామస్తులు చేసిన పోరాటం ఫలితంగా 26మంది విద్యార్థులు ఒకేరోజు సర్కారు బడిలో చేరడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement