పెద్దపల్లిరూరల్: వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన సమయాల్లో ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు కూడా అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయాధికారులతో శుక్రవారం వానాకాలం సాగుపై విప్ సమీక్షించారు. ఎలినినో ప్రభావంతో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులతో రైతులు నష్టపోకుండా అవసరమైన సలహా లు, సూచనలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వ లు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవస రం లేదని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విప్ చొరవతోనే కొనుగోళ్లు విజయవంతం
పెద్దపల్లి: ప్రభుత్వ విప్ విజయరమణారావు చొ రవతోనే యాసంగి ధాన్యం కొనుగోళ్లు విజయవంతమయ్యాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసి పూలమొక్క అందజేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా ముగియడం వెనుక ప్రభుత్వ విప్ నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక చొరవ ఉందని తెలిపారు. సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కేశెట్టి విక్రమ్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్టు మదన్ మోహన్, ప్రచార కార్యదర్శి బూరుగు సంతోష్ కుమార్, డైరెక్టర్ వల్ల కొండ రమేశ్, సీఈవోలు సురేశ్, రవీందర్‌రెడ్డి, సతీశ్, నహియుద్దీన్, దేవేందర్, తిరుపతి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు
ఎలిగేడు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై జూలపల్లి మండలానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన పలువురు నాయకులు శివపల్లిలోని విప్ విజయరమణారావు నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి విప్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాగా, సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయడం కోసం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు విప్‌ను కలిసి విన్నవించా రు. వసతుల కల్పన, పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చొప్పరి సుమన్, ప్రధానకార్యదర్శిఽ నిట్టూరి శ్రీనివాస్, కోశాధికారి కామని శ్రీకాంత్, గౌరవ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజలింగం, ఉపాధ్యక్షుడు పల్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
వరి సాగుపై ఎల్‌నినో ప్రభావం
ప్రభుత్వ విప్ విజయరమణారావు


