పెద్దపల్లి: విద్యా ప్రమాణాల పెంపులో అత్యంత ప్రతిభ చాటి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖాధికారి శారదకు విశిష్ట గౌరవం లభించింది. శుక్ర వారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి కలెక్టర్, డీఈవో పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని సీఎం సన్మానించి ప్రశంసపత్రం అందజేశారు. జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపినందుకు ఈ గుర్తింపు లభించిందని కలెక్టర్, డీఈవో తెలిపారు. జిల్లా విద్యా రంగాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయడంతోనే ఈ అరుదైన గౌరవం దక్కిందని, భవిష్యత్‌లో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
చెంచుల సంక్షేమానికి ప్రాధాన్యం
ముత్తారం: చెంచుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పారుపల్లిలో కలెక్టర్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలో 15 చెంచు కుటుంబా ఉండగా.. కూలీపని చేసుకొంటున్న చెంచుల్లో కొందరు గుడిసెలు, మరికొందరు అసంపూర్తి రేకులషెడ్లలో నివసిస్తున్నారని గుర్తించి అర్హులైన వారికి కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఇళ్లు పూర్తిచేయిస్తామన్నారు. సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. వారి జీవన ప్రమాణాల మరింత మెరుగుపర్చుతామని అన్నా రు. చెంచు కుటుంబాల పిల్లలు సర్కారు బడికి వచ్చేలా చూడాలని హెచ్‌ఎం వేగోలపు సదానందంను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పలువురు పిల్లలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రవేశాలు కల్పించారు. జూలై 31 వరకు తరగతి గదుల నిర్మాణం పూర్తిచేయా ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ భవనం పనుల పురోగతి పరిశీలించారు. ధర్యపూర్ మోడల్ స్కూల్ సందర్శించారు. సర్పంచ్ చొప్పరి సంపత్, తహసీల్దార్ మఽధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో సురేశ్, ప్రిన్సిపాల్ సదానందంగౌడ్, మాజీ జెడ్పీటీసీ చోప్పరి సదానందం పాల్గొన్నారు.
జిల్లాకు దక్కిన రాష్ట్రస్థాయి గుర్తింపు
అవార్డు అందుకున్న కలెక్టర్ శ్రీహర్ష


