పెద్దపల్లి: కోల్‌బెల్ట్‌లోని లీడర్లు, ప్రజాప్రతినిధులు ఇసుక, మట్టి, బూడిద దందా చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరిఖని, రామగిరి, పె ద్దపల్లిలో ఆమె శుక్రవారం పర్యటించారు. కవిత మాట్లాడుతూ, అన్నదాతలకు రైతుభరోసా ఇవ్వ డంలో, యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్రప్ర భుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అన్నిరకాల ధాన్యానికి బోనస్ చెల్లిస్తామన్న సర్కారు.. ఇప్పుడు ఏడు రకాల సన్నరరకం వడ్లకే ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పినా.. పెద్దపల్లి ఎమ్మెల్యే దీనికోసం కనీసం సీఎంను అడగడవం లేదన్నారు. భూపాలపల్లి వద్ద కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో పంటలు నష్టపోయే రైతులకు పరిహారం చెల్లించాలని, రామగుండంలోని గోదావరినీళ్లు తాగితే క్యాన్సర్ సోకే ప్ర మాదం ఉందని అంటున్నారని, దీనిపై మంత్రి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సీఎం తాను హి ట్లర్‌నని చెబుతున్నారని, కానీ, ఇక్కడి మంత్రి హి ట్లర్ కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ప్రిపేరవుతోందని, 5 వేల ఉద్యో గాలు హైదరాబాద్‌కు కూడా సరిపోవని, నిరుద్యోగ సమస్యను బట్టి కనీసం 20 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలోని ఓ స్వీట్‌హౌస్‌ను సందర్శించి మిఠాయి తయారీ విధానం పరిశీలించారు. మహిళలతో కలిసి మిఠాయి రుచిచూశారు.
సింగరేణిపై రాజకీయాలు వద్దు
రామగిరి: సింగరేణిపై రాజకీయాలు చేయొద్దని కవిత అన్నారు. అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన బాయిబాటలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఆహ్మద్‌తో కలిసి మాట్లాడారు. సింగరేణిలో నాణ్యమైన యంత్రాలు లేవని, కార్మికుల భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావే కాపాడుతున్నారని, సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మంత్రి శ్రీదర్‌బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం సెంటినరీ కాలనీలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో హెచ్‌ఎంఎస్, టీఆర్‌ఎస్ జెండాలను కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల మనోజగౌడ్, బోడ జనార్దన్, ఖాజాఇస్మాయిల్, గోశిక అశోక్, కొమ్ము మధునయ్య, శాంతిస్వరూప్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నృసింహుని సన్నిధిలో కవిత పూజలు
యైటింక్లయిన్‌కాలనీ: రామగిరి మండలం సుందిళ్ల శ్రీలక్ష్మీనృ సింహస్వామిని టీఆర్‌ఎస్ అధినేత కవిత దర్శించుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మట్టి, బూడిదనూ కొల్లగొడుతున్నారు
తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత


