పెద్దపల్లి: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులను తమ కుటుంబసభ్యులుగా భావించి సత్వర సేవలు అదించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. పెద్దపల్లి జోన్ మహిళా పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ శుక్రవారం తనిఖీ చేశారు. ఇన్‌స్పెక్టర్ రమేశ్‌బాబు ఆయనకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. బాధితులతో వ్యవహరించే తీ రు, సమస్యల పరిశీలన, ఫిర్యాదుల నమోదు, పరిష్కార మార్గలపై సిబ్బందిని అడిగి వివరాలు తె లుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా కేసుల్లో దర్యా ప్తు పూర్తిచేసి నిందితులను కోరుట్లో హాజరుపర్చాల ని అన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటే జీవితం సుఖమయంగా ఉంటుందని, సమస్యలతో వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య లు పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ,, ఎస్సై రాజమణి, సిబ్బంది పాల్గొన్నారు.
బాధితులకు సత్వర సేవలు అందించాలి
పోలీసులకు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచన


