ఆక్రమణల ముప్పు..! | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణల ముప్పు..!

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

సాక్షి, పెద్దపల్లి:

అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా యి. రూ.కోట్ల విలువైన వందలాది ఎకరాలు అక్రమార్కుల చెరలో చిక్కుకున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నామమాత్రంగా నోటీసులు జారీచేయడం వంటి చర్యలకే పరిమితమవుతోంది. శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో అక్రమార్కు లు వాటిపైనే మళ్లీమళ్లీ కన్నేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రజాప్రయోజన కార్యక్రమాలు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే ఈభూములు ఆక్రమణలకు గురైతే మళ్లీ స్వాధీనం చేసుకోవడం కష్టతరమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

మొక్కలు నాటడంతోనే సరి

ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో గతంలో ‘హరితహారం’ ద్వారా వేలాది మొక్కలు నాటా రు. ఉపాధిహామీ ద్వారా గతేడాది డిసెంబర్‌ 3న పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. కానీ, వాటి సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం వహించారు. పర్యవేక్షణ లేక మొక్కలు ఎండిపోయి భూమి ఖాళీగా మా రింది. దీనిని అదనుగా భావించిన అక్రమార్కులు.. భూములపై కన్నేసి, దున్నడం ద్వారా సాగులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. తద్వారా హక్కులు సాధించే లక్ష్యంతో తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రూ.కోట్ల విలువైన భూములపై కన్ను

అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి, ఎగ్లాస్‌పూర్‌, సోమనపల్లి, విసంపేట, పొట్యాల, మద్దిర్యాల శివారుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు చెరబడుతున్నారు. పొట్యాల శివా రులోని సర్వే నంబర్‌ 365, 369లో సుమారు 250 ఎకరాలు ఉంది. మిగతా గ్రామాల్లో మరో 300 ఎక రాలకు పైచిలుకు ఉంది. 2023లో సర్వే నంబర్లు 363, 369 పరిధిలోని సుమారు 60 ఎకరాల ప్రభు త్వ భూమిలో సాగు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో రెవెన్యూ అధికారులు వాటిని స్వాధీ నం చేసుకుని, బాధ్యులపై చర్యలు తీ సుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఆ విషయాన్ని వి స్మరించారు. దీంతో కొందరు సాగుకు సిద్ధం చేస్తున్నట్లు స మాచారం. గతంలో తవ్వించిన కందకాల ఆనవాళ్లు ఉ న్నా.. లెక్కచేయకుండా ఆక్రమణకు యత్నిస్తున్నారు.

శాశ్వత పరిష్కారం కోసం

ఎదురుచూపులు

ప్రతీసారి స్వాధీనం, హెచ్చరికలతోనే సరిపెట్టకుండా ప్ర భుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే రక్షణ ల భిస్తుందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఈ విషయమై అంతర్గాం తహసీల్దార్‌ పడాల ప్రసాద్‌రావును సంప్రదించగా..‘ఈ వ్యవహారం మా దృష్టికి వచ్చింది.. క్షేత్రస్థాయిలో మా సిబ్బందిని పంపించి అక్రమార్కుల వివరాలు సేకరిస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో ట్రాక్టర్‌లు పెట్టి సాగు చేస్తే సీజ్‌ చేస్తాం. అలాగే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం’ అని వివరించారు.

అంతర్గాంలో 200 ఎకరాల ప్రభుత్వ భూములకు ఎసరు

హెచ్చరికలు, నోటీసులతోనే సరిపెడుతున్న యంత్రాంగం

అక్రమార్కులకు అడ్డుకట్ట పడేది ఎప్పుడంటున్న స్థానికులు

కలెక్టర్‌ చొరవతో శాశ్వత పరిష్కారం

కలెక్టర్‌ చొరవే తీసుకుంటేనే

ఇటీవల ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామశివారులో 72.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేయడంలో కలెక్టర్‌ కీలకపాత్ర పోషించారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో అక్రమంగా తవ్వించిన 22 చెరువులను పూడ్చివేసి సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ నేపథ్యంలో అంతర్గాం మండలంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణపైనా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇందుకోసం సమగ్ర సర్వే నిర్వహించి సరిహద్దులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు

డ్రోన్‌ పర్యవేక్షణ, నిరంతర తనిఖీలు చేపట్టి ఆక్రమణదారులపై

కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement