పడిపోతున్న నీటినిల్వలు | - | Sakshi
Sakshi News home page

పడిపోతున్న నీటినిల్వలు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

రామగుండం: ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. ఈతరుణంలో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులో నీటినిల్వలు గణనీయంగా తగ్గుతున్నా యి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా, గురువారం 7.87 టీఎంసీలకు పడిపోయిందని అధికారు లు తెలిపారు. గతేడాది ఇదేరోజు 8.71 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో 257 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 609 క్యూసెక్కులు ఉందని వివరించారు. ఎన్టీపీసీకి 121 క్యూసెక్కు లు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 276 క్యూసెక్కులు, భగీరథ నీటి పథకానికి 58 క్యూసెక్కులు సరఫరా చేస్తుండగా, ఎండల తీవ్రతకు 131 క్యూసెక్కులు ఆవిరి అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

‘సర్‌ౖ’పె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ

జ్యోతినగర్‌: జిల్లా వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి చేపట్టే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)పై అదనపు కలెక్టర్‌, రామగుండం కా ర్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ గురువారం సి బ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్టీపీసీ కాకతీయ క ల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో స హాయక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, బూ త్‌ లెవల్‌ సూపర్‌వైజర్లు, ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏ లతో ‘సర్‌’ విధి విధానాలపై అవగాహన కల్పించారు. అంతర్గాం, రామగుండం తహసీ ల్దార్లు ప్రసాద్‌రావు, రవీందర్‌రావు, నాయబ్‌ తహసీల్దార్‌ అనిల్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు బొంతల రాజేశ్‌, ఆసిఫ్‌పాషా, బీఎస్‌పీ ప్రతినిధి జనగామ లింగయ్య, సీపీఐ తరపున గోవర్ధన్‌ తదితరులు శిక్షణకు హాజరయ్యారు.

బొంపల్లిలో అధికారుల సర్వే

పెద్దపల్లిరూరల్‌: బొంపల్లిలో గురువారం పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే చేశారు. గణాంక శా ఖ ఆధ్వర్యంలో గ్రామీణుల జీవన స్థితిగతు లు, ఉపాధి అవకాశాల తీరుపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సాధారణ వివరాలను సేకరించిన అనంతరం ట్యాబ్‌ ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో మూడు నెలలకోసారి సర్వే నిర్వహించి వివరాలను న మోదు చేస్తామని వివరించారు. సర్పంచ్‌ దాడి మౌనిక – సంతోష్‌, ఉపసర్పంచ్‌ పంబాల రాజుతోపాటు వార్డు సభ్యులు, అంగన్‌వాడీటీచర్‌ కడారి కనకలక్ష్మి, ఏఎన్‌ఎం రాజేశ్వరి, ఆశవర్కర్‌ లలిత తదితరులు పాల్గొన్నారు.

కాలనీలో పోలీసుల తనిఖీలు

యైటింక్లయిన్‌కాలనీ: గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి యైయెటింక్లయిన్‌కాలనీలో నార్కోటిక్స్‌ డాగ్‌తో పోలీసులు గురువారం విస్త్రతంగా తనిఖీలు చేశారు. స్థానిక షిర్కెబస్‌స్టాప్‌ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏరియాలు, ప్రధాన కూడళ్లు, దుకాణాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో సీఐ ప్రసాద్‌రావు తన సిబ్బందితో కలిసి విస్తృతంగా సోదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తుపదార్థా లు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టూటౌన్‌ పోలీస్‌ సిబ్బందితోపాటు నార్కోటిక్స్‌ విభాగం పోలీసులు పాల్గొన్నారు.

21న యోగా దినోత్సవం

పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు కలె క్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆయుష్‌ ఆధ్వర్యంలో ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌’ అంశంపై స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో యోగా శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement