పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రి లో ని పిల్లల ఓపీ సేవల్లో రద్దీ నియంత్రించి, మెరుగైన వైద్యసేవలు అందిచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆ దేశించారు. స్థానిక మాతా శిశు ఆస్పత్రి, బండారికుంట ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో పలు అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పేషెంట్ల రద్దీకి అ నుగుణంగా వైద్యసేవలు విస్తృతం చేయాలన్నారు. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా చూడాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందజేయాలని అన్నారు. మరోవైపు.. కలెక్టర్ తని ఖీ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖలోని డాక్టర్లు మొదలుకొని సిబ్బంది వరకూ ఎవరూ ఆఫ్రాన్ ధరించక పోవడం విస్మయాన్ని కలిగించింది.
నాణ్యంగా అభివృద్ధి పనులు..
జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. పెండింగ్ బిల్లులపై సమగ్ర నివేదిక అందజేయాలనియ ఆయన సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ సందర్భంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గుౖ రెన వారికి సాయం అందించేందుకు 14446 నేష నల్ డీ అడిక్షన్ హెల్ప్‌లైన్ సేవలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్‌ఎస్ శ్రీధర్, ఆర్‌ఎంవో విజయ్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, పంచాయతీరాజ్ ఈ ఈ శంకరయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్, జిల్లా సంక్షేమ అధికారి కాళిందిని, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత, డీహెచ్‌ఈడబ్ల్యూ డీఎంసీ అరుణ, బ్లాక్ కోఆర్డినేటర్ హసీబ్, డీ అడిక్షన్ సెంటర్ కో ఆర్డినేటర్ శ్యామల, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


