జీజీహెచ్‌ అభివృద్ధికి సహకారం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ అభివృద్ధికి సహకారం

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) అభివృద్ధికి సహకరించడంతోపాటు స మస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామగుండం మేయర్‌ మహం కాళి స్వామి హామీ ఇచ్చారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ హిమబిందుసింగ్‌, ఆర్‌ఎంవో కృపాబాయి స్వాగతం పలికి నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. తరచూ విద్యుత్‌ సమస్య తలెత్తుతుందని వైద్యాధికారులు మేయర్‌ దృష్టికి తీసుకురాగా, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్య తీసుకోవాలన్నారు. శారదానగర్‌ వాటర్‌ట్యాంక్‌ నుంచి సరఫరా చేస్తున్న తాగునీటి పైప్‌లైన్‌ వాల్వ్‌ ను జీజీహెచ్‌లో ఏర్పాటు చేయాలని కోరగా, ఇంజినీర్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. ఎమర్జెన్సీలోని వైద్యులు, సిబ్బంది ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని మేయర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరుకార్పొరేటర్ల భర్తలను ఆస్పత్రికి తీసుకొచ్చిన సందర్భంలో, వైద్యులు అప్రమత్తంగా లేకపోవడాన్ని గమనించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల విషయంలోనే ఇలాంటి నిర్లక్ష్యా న్ని వ్యవహరిస్తున్న వైద్యులు, సామాన్య పేదప్రజల విషయంలో ఇంకెత నిర్లక్ష్యం వహిస్తున్నారోనని ఆ వేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న కార్పొరేటర్‌ కంకణాల మౌనిక భర్త రాజును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్‌ గట్ల రమేశ్‌, యుగంధర్‌, డాక్టర్‌ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంటువ్యాధులపై అప్రమత్తం

ప్రజలు అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండా లని మేయర్‌ మహంకాళి స్వామి సూచించారు. 46 వ డివిజన్‌ సంజయ్‌గాంధీనగర్‌లో వార్డుసందర్శన చేపట్టారు. మేయర్‌ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రా రంభమైన నేపథ్యంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు, ఈగలు వృద్ధి చెందిని అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందన్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరగవలసి వస్తుందని అన్నారు. బహిరంగ ప్రదేశాలు, కాలువల్లో చెత్త వేయకుండా నగరపాలక సంస్థ వాహనాలకు అందించాలని కోరారు. శానిటేషన్‌ సిబ్బంది స్పెషల్‌ డ్రైవ్‌తో రోడ్డుకు ఇరువైపులా పొదలు, చెట్లకొమ్మలు, రాళ్లు తొలగించారు. నాలా శుభ్రం చేశారు. కార్పొరేటర్లు, అధికారులు నవీన్‌, మీర్‌, శ్రీనివాస్‌, సంపత్‌, చంద్రారెడ్డి, మెప్మా సీవో ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రి సమస్యలు పరిష్కరిస్తాం

రామగుండం నగర మేయర్‌ స్వామి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement