యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి కార్మికుల హక్కుల సాధన, సౌకర్యాల కల్పనకు హెచ్‌ఎంఎస్‌కు సంపూ ర్ణ మద్దతు ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కోరారు. బా యిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం సిగరేని ఆర్జీ–2ఏరియా ఓసీపీ–3 బేస్ వర్క్‌షాప్‌లో హెచ్‌ఎంఎస్ నాయకులతో కలిసి కార్మికులతో స మావేశమయ్యాడారు. కవిత మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో ప్రస్తుతం యువకార్మికుల సంఖ్య అ త్యధికంగా ఉందన్నారు. వారిపిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యాజమాన్యం సీబీఎస్‌ఈ పాఠశాలలను సంస్థ వ్యాప్తంగా ప్రారంభించాలని కోరారు. ఇందులో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని అన్నారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, టీఆర్‌ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటన
పెద్దపల్లి: తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నియోజవర్గంలో పర్యటిస్తారని, ఈసందర్భంగా జెండా పండుగ నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి సలేంద్ర కొ మరయ్య యాదవ్ తెలిపారు. తొలుత జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తారని, అనంతరం వ్యాపారులతో సమావేశమవుతారని, జెండా చౌరస్తాలో టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరించి మాట్లాడుతారన్నారు. అక్కడి నుంచి పెద్దకల్వల బస్టాండ్ చౌరస్తాకు చేరుకుని జెండా ఆవిష్కరించాక ధూళికట్టకు బయలుదేరి వెళ్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ నేత కవిత


