సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలి

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలి

యైటింక్లయిన్‌కాలనీ: ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కార్మికులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆర్జీ–3 జీఎం మధుసూదన్‌ సూచించారు. ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌(ఓసీపీ)–1 బేస్‌ వర్క్‌షాప్‌లో గురువారం సింగరేణి అధికారులతో కలిసి జీఎం ఐదు ఎస్కార్ట్‌ యంత్రాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఉత్పాదకతపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇందుకు యంత్రాలు కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో ఓసీపీ –వన్‌కు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించిన మంచి పేరు ఉందని గుర్తుచేశారు. దీనిని ఇలాగే కొనసాగించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సింగరేణి ఏరియా ఇంజినీర్లు ఉదయ్‌, భాస్కర్‌, ఆర్‌పీరెడ్డి, ప్రాజెక్ట్‌ అధికారి ప్రవీణ్‌, గని మేనేజర్‌ పాపయ్య, అధికారులు రవీందర్‌రెడ్డి, యూనియన్‌ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్జీ–3 జీఎం మధుసూదన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement