డ్రైనేజీల్లో చెత్త వేయొద్దు | - | Sakshi
Sakshi News home page

డ్రైనేజీల్లో చెత్త వేయొద్దు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌

కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్య పనుల పరిశీలన

పెద్దపల్లిరూరల్‌: మురుగునీటి కాలువల్లో చెత్తాచెదా రం పడవేయొద్దని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌ కౌన్సిలర్లతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సిబ్బంది చేపట్టిన పారిశుధ్య పనులను వారు పర్యవేక్షించారు. పట్టణంలోని మున్సిప ల్‌ 14వ వార్డులోగల డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడాన్ని వారు గుర్తించారు. తక్షణమే పారిశు ధ్య సిబ్బందితో చెత్తాచెదారం తొలగించారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయడం ద్వారా మురుగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని, డ్రైనేజీల్లో చెత్త వేయొద్దని వారు సూచించారు. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement