గోదావరిఖనిటౌన్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆర్టీసీ డి పో మేనేజర్ చల్లా కవితారె డ్డి అన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమె బు ధవారం తన కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఖని డిపోనుంచి గ్రామాలకు బస్సు సర్వీసులు పెంచుతామన్నారు. విద్యార్థుల కోసం ఇప్పటికే 15 బస్సులు నడిపిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ రీజియన్‌లోని 11 డిపోల్లో ఖని డిపో లాభాల్లో నడుస్తోందని వెల్లడించారు. ప్రయాణికులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. డిపో సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అమృత పాల్గొన్నారు.


