గురువులకు వందనం | - | Sakshi
Sakshi News home page

గురువులకు వందనం

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

గురువారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2026 ఇంటింటికీ వెళ్లి.. బైక్‌పై తరలించి ●

న్యూస్‌రీల్‌

సర్కార్‌ బడిని చక్కదిద్దిన టీచర్లు

గురువారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2026

విద్యార్థులను బైక్‌పై తీసుకెళ్తున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం తంగళ్లపల్లి శ్రీనివాస్‌ కృషి ఫలించి.. 35 మంది ఉన్న స్కూల్‌ ప్రస్తుతం సంఖ్య 70కి చేరింది. 2024 నుంచి సిరికొండలో హెచ్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ పాఠశాలకు హాజరుకాని విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి మరీ తన బైక్‌పై తీసుకొస్తున్నారు. ప్రస్తుతం స్కూల్‌లో హెచ్‌ఎంతోపాటు డిప్యూటేషన్‌పై ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్లు, ఒక ఎస్జీటీ పనిచేస్తున్నారు. వంద శాతం హాజరు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల లిస్ట్‌ తీసుకొని ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి తన బైక్‌పై స్కూల్‌కు తీసుకొస్తారు. గ్రామస్తుల సహకారంతో ఇద్దరు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు. దాతల సహాయంతో తాగునీటి వసతి, సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సమీపంలోని తెనుగువారిపల్లి, మేళ్లచెరువు గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తుంటారు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో పయణించేలా మార్గదర్శనం చేసే గురువులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. బోధనను ఉద్యోగంగా కాకుండా సేవగా గుర్తించి ముందుకెళ్తున్నారు జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు. కొందరు నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు కొనిచ్చి ఇస్తుంటే.. మరికొందరు ఇంటింటికి వెళ్లి తమ బైక్‌, ఆటోలపై పిల్లలను స్కూల్‌కు తరలిస్తున్నారు. గ్రామస్తుల పిల్లలనే కాదు తమ పిల్లలను కూడా సర్కారు బడిలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వారు మరికొందరు. ఇలా ప్రభుత్వ బడి బాగుపడడంలో తమవంతు పాత్ర పోషిస్తున్న గురువులపై ప్రత్యేక కథనం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement