ఫిట్నెస్ లేకున్నా రహదారులపైకి యథేచ్ఛగా స్కూల్ బస్సులు 78 శాతానికే పరిమితమైన సామర్థ్య టెస్టులు వృద్ధులు, అనుభవం లేనిడ్రైవర్లతో కాలక్షేపం నిబంధనలు పాటించడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం
సాక్షి పెద్దపల్లి : జిల్లాలో పాఠశాలలు, కళాశాలు ప్రారంభమయ్యాయి. స్కూల్ బస్సులు భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని యాజమాన్యాలు ఫిట్నెస్‌లేని బస్సులను రోడ్కెక్కిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం జిల్లాలో మరో 57 బస్సులు సామర్థ్య పరీక్షలు పూర్తిచేయాల్సి ఉంది. ఈ విషయంలో కొన్నివిద్యాసంస్థలు ఆసక్తి చూపడంలేదనే విమర్శలు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఫిట్నెస్‌లేని వాహనం రోడ్డెక్కితే రోజూ రూ.50 చొప్పున అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయినా విద్యాసంస్థల్లో చలనం కనిపించడంలేదు.
తనిఖీలు అంతంతే..
ఇతర వాహనాలకు సామర్థ్య పరీక్షలు ఏడాదిపాటు చెల్లుబాటువుతాయి. స్కూల్ బస్సుల విషయంలో ఎప్పుడు ఫిట్నెస్ టెస్ట్ చేయించినా.. ఏటా మే 25వ తేదీతోనే వాటి గడువు ముగుస్తుంది. అయినా చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. మరోపక్క విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే రవాణా, పోలీసు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలి. కానీ చాలా వరకు ఇది అమలుకావడం లేదు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
జిల్లా సమాచారం
ప్రైవేట్ పాఠశాలలు 173 ఫిట్‌నెస్ పూర్తయినవి 204 ఇంకా చేయాల్సినవి 57
ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను కుక్కితీసుకెళ్తున్న ఆటో ఇది. ఆర్టీసీ బస్సు సౌకర్యంలేని చాలాప్రైవేట్, ప్రభుత్వ మోడల్ స్కూళ్ల విద్యార్థులను పల్లెటూళ్ల నుంచి తరలించేందుకు ఆటోలే దిక్కు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఆటోడ్రైవర్లు పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్‌తోపాటు విద్యార్థులను ఇలా కుక్కితీసుకెళ్తున్న ఆటోలపైనా పోలీస్, రవాణా శాఖల అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.


