త్రిలింగేశ్వరస్వామి దర్శనం | - | Sakshi
Sakshi News home page

త్రిలింగేశ్వరస్వామి దర్శనం

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

గోదావరిఖనిటౌన్‌: జనగామ త్రిలింగేశ్వరస్వా మిని సమాచార హక్కు కమిషన్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లు బుధవారం దర్శించుకున్నారు. కార్పొరేటర్‌ తోకల శ్యామని, కమిష నర్లు పర్వీన్‌, కుమార్‌, భూపాల్‌, పీవీ శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి తదితరులు ఉన్నారు.

సింగరేణి అధికారుల నిరసన

కోల్‌సిటీ: తమ సమస్యలు పరిష్కరించాలనే డి మాండ్‌తో సింగరేణి అధికారులు బుధవారం ెగోదావరిఖనిలో భారీనిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్జీ–1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్‌ డివిజన్ల అధికారులు హాజరయ్యారు. అఖిల భారత బొగ్గు గనుల అ ధికారుల సంఘం(సీఎంవోఏఐ) నాయకులు తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్‌, పెద్ది నర్సింహులు, పొ నుగోటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే(పీఆర్‌పీ)ని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌)లో మాదిరిగా సింగరేణి సంస్థలోనూ అమలు చేయాలన్నారు.

కార్మికుల సమస్యలపై సమీక్ష

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై బుధవారం స్థానిక పరిపాలన భవనంలో కాంట్రాక్టర్లు, ఎన్టీపీసీ హెచ్‌ఆర్‌ అధికారులతో కార్మిక సంఘం జాతీయ నేత బాబర్‌సలీంపాషా చర్చలు జరిపారు. వివిధ యూనియన్ల నాయకులు భూమల్ల చందర్‌, లక్ష్మారెడ్డి, ఇజ్జగిరి భూమయ్య, రాజమల్లు, బుచ్చన్న, ఆలేటి శ్రీనివాస్‌, చింతల సత్యం, అలుగొండ అనిల్‌, లక్ష్మణ్‌ హాజరయ్యారు.

రామయ్య చిరస్మరణీయులు

మంథని: కవిత్వం, సాహిత్యం ద్వారా ప్రజల ను చైతన్యపరిచిన ప్రజాకవి రావికంటి రామ య్యగుప్తా కీర్తి అజరామరమని మున్సిపల్‌ చై ర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌ అన్నారు. మంత్రకూట వేమన, ప్రజాకవి రావికంటి రామయ్యగుప్తా జయంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బు ధవారం నిర్వహించారు. రామయ్య కుమారు డు రావికంటి శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మ న్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, మంథని విద్యార్ధి యువత అధ్యక్షుడు కొండెల మారుతి, నాయ కులు రామడుగు మారుతి, శశిభూషన్‌కాచే, వి జయ్‌కుమార్‌, ఎల్లంకి వంశీధర్‌ పాల్గొన్నారు.

సరిపడా యూరియా నిల్వలు

పెద్దపల్లి: వానాకాలం సీజన్‌కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్‌ కో య శ్రీహర్ష తెలిపారు. యాప్‌ ద్వారా బుక్‌చేసుకునే రైతులకు 18,750 మెట్రిక్‌ టన్నుల యూ రియా పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో యూరియా బుకింగ్‌ యాప్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని, మరోరెండు లేదా మూడురోజుల్లో పునరుద్ధరిస్తామన్నారు.

బాలసదన్‌లో ప్రవేశాలు

పెద్దపల్లి: మహిళా, శిశు సంక్షేమ శాఖ సుల్తానాబాద్‌ మార్కండేయ కాలనీలో నిర్వహిస్తున్న బాలసదన్‌ చిల్డ్రెన్‌ హోమ్‌ ఫర్‌ బాలికలులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ ఇన్‌చార్జి అధికారి కాళిందిని తెలిపారు. వివరాల కోసం 63003 98362 నంబరులో సంప్రదించాలని కాళిందిని కోరారు.

రూ.5.25 కోట్లతో అభివృద్ధి

మంథని: నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.5.25 కోట్లు మంజూరైనట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. మంథనికి రూ.2.55 కోట్లు, ముత్తారానికి రూ.80లక్షలు, రామగిరికి రూ.90లక్షలు, కమాన్‌పూర్‌కు రూ.60లక్షలు, పాలకుర్తికి రూ.20లక్షలు మంజూరైనట్లు కార్యాలయ ప్రకటన వివరించింది.

‘సర్‌’పై బీఎల్‌వోలకు శిక్షణ

పెద్దపల్లిరూరల్‌: స్థానిక అమర్‌చంద్‌ కల్యాణమండపంలో బుధవారం పోలింగ్‌బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లకు ‘సర్‌ౖ’పె అవగాహ కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటరెడ్డి హాజరై సర్‌పై అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్‌ రాజయ్య, ఆర్‌ఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement