బహింగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా | - | Sakshi
Sakshi News home page

బహింగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

● రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి

● రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి

కోల్‌సిటీ: బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, కాలువల్లో చెత్త వేస్తే భారీ జరిమానా విధిస్తామని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి హెచ్చరించారు. 46వ డివిజన్‌ ఇందిరానగర్‌లో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్‌ అరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన వార్డుపర్యటన చేపట్టారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి వెలువడే నీరు స్థానికుల ఇళ్లలోకి చేరుతోందని, వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని, దీని నివారణకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక ఒక మద్యం దుకాణం ఎదుట రోడ్డుపై నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. ఖాళీ సీసాలను కాలువలో పడవేసిన దుకాణ యజమానికి జరిమానా విధిస్తూ నోటీసు జారీ చే యాలని కమిషనర్‌ ఆదేశించారు. కార్పొరేటర్లు దా సరి సాంబమూర్తి, చిదురాల నాగరాజు, వడ్లూరి రవి, టీపీఎస్‌ నవీన్‌, ఏఈ మనోజ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌, మెప్మా సీవో ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీబాట

ఫెర్టిలైజర్‌సిటీ: చిన్నారుల ఉజ్వల భవిష్యత్‌కు అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించాలని మేయర్‌ మహంకాళి స్వామి కోరారు. 23వ డివిజన్‌ చైతన్యపురికాలనీలో అంగన్‌వాడీ బడిబాట నిర్వహించారు. కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేటర్‌ కన్నూరి భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్త శైలజ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement