● మేయర్ మహంకాళి స్వామి
యైటింక్లయిన్‌కాలనీ: డ్రైనేజీ పనుల్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించద్దని మేయర్ మహకాళి స్వామి సూచించారు. కార్పొరేషన్ 14వ డివిజన్ ఏరియా రాజీవ్‌నగర్, లంబడి తండాలోని ప్రధాన డ్రైనేజీల్లో సింగరేణి చేపట్టిన పూడికతీతను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీ సిద్ధార్థనగర్, సంతోష్‌నగర్, హనుమాన్‌నగర్ నుంచి వస్తున్న ప్రధాన ఓపెన్ డ్రైనేజీలో పూడికతీతను మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన పర్యవేక్షించారు. కార్య క్రమంలో కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మారెల్లి రాజిరెడ్డి, కార్పొరేటర్ శంకర్ నాయక్, కాలనీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేశ్, అధికారులతోపాటు నాయకులు రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మార్క రాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


