పెద్దపల్లి: అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్‌రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూలమొక్క అందజేశారు.
ఆయిల్‌పామ్ సాగుచేయండి
జూలపల్లి: ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదా యం వస్తుందని జిల్లా ఉద్యాన ఆధికారి మహే శ్ అన్నారు. వడ్కాపూర్‌లో రైతు దాసరి ప్రశాంత్‌రెడ్డి, పుష్పలత 14 ఎకరాల్లో సాగుచేసిన ఆ యిల్‌పామ్ గెలలు పక్వానికి రావడంతో మంగళవారం వాటిని కోసి కంపెనీకి సరఫరా చేశా రు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్, ఉద్యాన విస్తరణాధికారి మహేశ్ తో కలిసి తోట సందర్శించారు. మహేశ్ మా ట్లాడుతూ, జిల్లాలో 3,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారని తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్, కంపెనీ ప్రతినిధులు, రైతులు ఉన్నారు.
క్రికెట్ పోటీల్లో ప్రతిభ
జ్యోతినగర్: అల్గునూరులో సోమవారం నిర్వ హించిన అండర్–16 సమ్మర్ క్రికెట్ కప్ టీ– 20 లీగ్ పోటీల్లో ఎన్టీపీసీకి చెందిన 22 యార్డ్స్ క్రికెట్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. జట్టులోని కె.ఆదిత్య వర్ధన్ ప్రతిభ కనబరచడంతో బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు లభించింది. రోహిత్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడని జట్టు పీఈటీ కోచ్ సుధేశ్‌కుమార్ తెలిపారు. క్రీడాకారులను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మ నోహర్‌రావు, ఉపాధ్యక్షుడు మురళీధర్‌రా వు, గోదావరిఖని సీనియర్ క్రికెటర్, కోచింగ్ క్యాంపు నిర్వాహకుడు డి.కిరణ్‌కుమార్‌యాదవ్ తదితరులు అభినందించారు.
నిందితుడిని ఉరితీయాలి
కోల్‌సిటీ: ఖమ్మంలో బాలికపై అత్యాచారం చేసి భవనం పైనుంచి తోసివేసిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయాలని మహిళా సురక్ష వేదిక డిమాండ్ చేసింది. రామగుండం బల్దియా కా ర్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశా రు. వారు మాట్లాడుతూ, బాలికపై జరిగిన దా రుణం రాష్ట్రాన్ని కలచివేసిందని, ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠి న చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు లలిత, కోట తిరుమల, పైతరి శరణ్య భవాని, ఇందిర, వీణ, వందన, హరిణి, శ్రీజ, ముని గాల సంపత్, అడిగొప్పుల రాజు, పైతరి రా జు, సంపత్ యాదవ్, మ్యాడగోని రవీందర్, ఆరెల్లి జలంధర్, పొన్నం శశికుమార్, రాజ్‌కుమార్, పల్లికొండ ప్రశాంత్, సంజీవ్, గోటిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ కమిటీలతో బలోపేతం
పెద్దపల్లి: సంఘాన్ని బలోపేతం చేయడానికి గ్రామ, పట్టణ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని మున్నూరు కాపు సంఘం జిల్లా కన్వీనర్ పెంట రాజేశ్ పటేల్ అన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, జిల్లా కో కన్వీనర్లను మంగళవారం నియమించాక ఆ యన మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బలమైన సంఘంగా నిర్మిస్తామని, ప్రజాస్వా మ్య పద్ధతిలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహి స్తామని అన్నారు. జిల్లా కన్వీనర్‌గా పెంట రాజేశ్, కో కన్వీనర్లుగా జొన్నల రవి, తోముల శ్రీను, దొడ్ల దేవేందర్, బాలకృష్ణ, రాజేశంను నియామకం చేసినట్లు ఆయన ప్రకటించారు.


