ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.15కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.15కోట్లు

Jun 16 2026 11:40 PM | Updated on Jun 16 2026 11:40 PM

● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

పెద్దపల్లి/ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లు వెచ్చిస్తున్నామని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు తెలిపారు. హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్‌లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో స్థపతి వల్లినయాగన్‌ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు కేటాయించడంతోపాటు ఆలయ ప్రత్యేక నిధుల నుంచి రూ.5 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఓదెల మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్‌ మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌

ఓదెల: విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ విజయరమణరావు హామీ ఇచ్చారు. శివపల్లిలో ఓదెల విశ్వబ్రాహ్మణులు ఆయనను మంగళవారం ఘనంగా సన్మానంచారు. 50ఏళ్ల వయసు నిండినవారికి పింఛన్‌ మంజూరు చేయాలని విన్నవించారు. నాగవెల్లి శ్రీమన్నారాయణ, నాగవెల్లి ఈశ్వర్‌, నూతి సత్యనారాయణ, బీమయ్య, నూతి శంకర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement