ముత్తారం: మండలంలోని పోతారంలో ఉపాధి హామీ కూలీలు పని వద్ద తమ ఫొటోలు ఆన్‌లైన్‌లో క్యాప్చర్ కావడం లేదని సోమవారం ఆందోళనకు దిగారు. ఉపాధిపనికి వెళ్లిన సుమారు 400 మంది కూలీలకు ఎలాంటి శిక్షణ లేని ముగ్గురు మేట్లతో ఫొటోలు క్యాప్చర్ చేసే పని అప్పగించడంతో మండిపడ్డారు. ఉదయం పనికి వెళ్లిన కూలీలు గంటల తరబడి వేచి ఉన్నా 26 మందివి మాత్రమే ఆన్‌లైన్ కావడంతో మిగతా కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సమస్య ఉద్రిక్తతకు దారితీయడంతో ఎంపీడీవో సురేశ్ సంఘటన స్థలంకు చేరుకొని కూలీలతో మా ట్లాడారు. మంచినీళ్లు తాగి కూలీ పనికి వస్తే మాకు పని కల్పించకుండా మీ అధికారుల నిర్లక్ష్యంతో మా కు అవస్థలు ఏంటని కూలీలు ఎంపీడీవోను ప్రశ్నించారు. ఎంపీడీవో ఈ రోజు పని రద్దు చేస్తున్నట్లు తెలిపి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళన విరమించారు.


