యైటింక్లయిన్‌కాలనీ: గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టి పె ట్టాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. సోమవారం గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలీ స్‌స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరును పరి శీలించి రిసెప్షన్ రికార్డులను తనిఖీ చేశారు. సి బ్బందితో మాట్లాడి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. నేరాల నమోదు, రౌడీ షీటర్ల వివరాలను సీఐ ప్రసాద్‌రావును అడిగారు. సైబర్ క్రైం, ట్రాఫిక్ రూల్స్‌పై నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. టూటౌన్ సీఐ ప్రసాద్‌రావు, ఆడిషనల్ సీఐ లింగమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


