ఎలిగేడు: చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లోని శ్రీనివాస చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం ఎలిగేడు మండలం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చేనేత సహకారం సంఘం అధ్యక్షురాలి గా ఏకగ్రీవంగా ఎన్నికై న గోలి పద్మ, ఉపాధ్యక్షుడు గుండ రాజేశం, కోశాధికారి ఎనగంటి ఆగయ్యతోపాటు డైరెక్టర్లు విజయరమణారావును సన్మానించారు. ఈసందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటిదని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన చేనేత కార్మికులకు అందేలా కృషిచేస్తానని తెలిపారు.
బైపాస్ రోడ్డు పనులు పరిశీలన
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుంచి నిమ్మనపల్లి మీదుగా సాగుతున్న బైపాస్‌రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. రాజీవ్‌రోడ్డుపై పెరిగిన వాహన రద్దీతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారని, వారి చిరకాల వాంఛను సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. బైపాస్‌రోడ్డు ఇరువైపులా ఉన్న రైతులు సంపూర్ణ సహకారం అందిస్తూ ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్, ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటు కౌన్సిలర్లు అమ్రేశ్, జగదీశ్, మహేందర్, సర్పంచ్ ఆరె సంతోష్, నాయకులు నర్ల పోల్‌రాజు, మందల సత్యనారాయణరెడ్డి, రమేశ్, తిర్రి రాజు, అర్కుటి సంతోష్ తదితరులున్నారు.


