రామగుండం అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రామగుండం అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కవాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అన్నారు. పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 23వ డివిజన్‌ మాతంగికాలనీలో మేయర్‌ మహంకాళి స్వామి, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ బెంద్రం సునీతలతో కలిసి పర్యటించారు. స్థానిక అవసరాలు, మౌలిక వసతులపై అభిప్రాయాలు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. రామగుండం ప్రాంతాన్ని గొప్ప నగరంగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మన ఇంటితో పాటు మన కాలనీని పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె హరీశ్‌రెడ్డి, ఆసిఫ్‌ ఖాన్‌, భేంద్రం రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement