న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, పెద్దపల్లి:
ఆటపాటలతో వేసవి సెలవులు సరదాగా గ డిచిపోయాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాటకు సిద్ధమయ్యారు. నెలన్నరపాటు బోసిపోయిన స్కూళ్లు సోమవారం మళ్లీ కళకళలాడనున్నాయి. చిన్నారులకు స్వాగతం పలికేందు కు కొన్నిప్రభుత్వ పాఠశాలల్లో స్వాగత ఏర్పాట్లు చే స్తుండగా, చాలాచోట్ల వసతులలేమి ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉంది. మన ఊరు–మనబడి, అ మ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అభివద్ధి చేపట్టినా.. చా లాచోట్ల అసంపూర్తిగానే ఉన్నాయి. సర్కారు బడు ల్లో ప్రవేశాలు పెంచేందుకు ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ని ర్వహించనున్నారు. ఇప్పటికే సుమారు 2వేలకుపైగా కొత్తగా ప్రవేశాలు తీసుకున్నారు.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
ఉచిత విద్య, పాఠ్య, రాతపుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, అర్హత, నిష్ణాతులైన టీచర్లు, విశాలమైన మైదనాలు.. ఇలా అనేక ప్రత్యేకతల ప్రభుత్వ పాఠశాలలు సమాహారంగా ఆహ్వానిస్తున్నాయి. ఉత్సాహభరిత వాతావరణంలో ఆరభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రైవేట్ సూళ్ల నిర్వాహకులు నెలముందు నుంచే విద్యార్థులను ఆకర్షించే యత్నాలు ఆరంభించారు.
పుస్తకాలు సిద్ధం
జిల్లాలోని ప్రభుత్వ బడుల విద్యార్థులకు 2,18,000 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే పాఠశాలలకు వచ్చి చేరాయి. యూనిఫామ్స్ సై తం తొలిరోజే అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు చేరలేదని టీచర్లు చెబుతున్నారు.
పరిశుభ్రత, భద్రతకు ప్రత్యేక చర్యలు
జిల్లాలో ప్రాథమిక 115, ప్రాథమికోన్నత 4, జెడ్పీ 98, గురుకులాలు 10, మోడల్ స్కూళ్లు 7, కేజీబీవీలు 10, ఎస్సీ 3, బీసీ 6, మైనారిటీ ఒకటి, 175 ప్రైవేట్, 4సీబీఎస్‌ఈ పాఠశాలలు ఉన్నాయి. వీటి లో 1,46,689 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తొలిరోజు నుంచే నాణ్యమైన, శుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం, విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సెలవుల్లో మూసివేసిన వంటగదులు, నిత్యావసరా ల నిల్వ గదులు, భోజనశాలలను బ్లీచింగ్ పౌడ ర్‌తో శుభ్రపరచడంతోపాటు వంటపాత్రలను వేడి నీటితో శుభ్రం చేయాలని ఆదేశించారు. నిల్వఉన్న బియ్యం, పప్పులు తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి, పాడైన వాటిని తొలగించి తాజా సరుకులను వినియోగించనున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటికే శుభ్రత, పరిశుభ్రత, సురక్షితవంట విధానాలపై శిక్షణ ఇచ్చారు. వంట సిబ్బంది శుభ్రత పాటించడంతోపాటు గ్లౌస్‌లు, క్యాప్‌లు, అప్రాన్ ధరించడం తప్పనిసరి చేశారు. భోజనం వడ్డించే ముందు ప్రధానోపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు రుచిచూసి నాణ్యత ని ర్ధారించనున్నారు. సెలవుల సందడి ముగియడంతో విద్యార్థులు కొత్త తరగతులకు సిద్ధమవుతున్నా రు. కొత్త పుస్తకాలు, బ్యాగులు, విద్యాసామగ్రితో బడిబాట పట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. పాఠశాలల ప్రారంభం రోజే అమావాస్య కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించడంపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు.
సెలవులకు టాటా.. ఇక బడిబాట
నేడు స్కూళ్లు పునఃప్రారంభం
ముస్తాబైన సర్కారు పాఠశాలలు
తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు


