సేవలకు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సేవలకు పురస్కారం

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: రక్తదానం చేసేలా ప్రోత్సహించడంతోపాటు రక్తదాన శిబిరాలు నిర్వహించిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కన్వీనర్‌ కావేటి రాజ్‌గోపాల్‌కు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆదివారం అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును రాజ్‌గోపాల్‌ అందుకున్నారు. పలువురు అభినందించారు.

వద్దన్నా వినరే..

కాల్వశ్రీరాంపూర్‌: వానాకాలం సాగుకు రైతు లు సిద్ధమయ్యారు. తొలకరి కురిసిన వెంటనే విత్తనాలు వేయొద్దని వ్యవసాయాధికారులు మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. వేసవిలోనే పొడి దుక్కులు దున్నుకున్న అన్నదాతలు.. ఇప్పుడు నేలలో విత్తనాలు వేస్తున్నారు. మరికొందరు ట్రాక్టర్లు, ఎడ్లనాగళ్లతో దుక్కు లు దున్నుతూ పత్తి విత్తనాలు వేస్తున్నారు. ఈ విషయంపై ఏవో సంధ్య మాట్లాడుతూ, తొలకరిలో విత్తనాలు చల్లితే.. మలిదశలో వర్షాలు కురిస్తేనే మొలకెత్తుతాయని, అలా కురవకుంటే నేలలో మాడిపోతాయన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

గాలివాన బీభత్సం

ఓదెల: గుంపులలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతోపాటు మామిడి వెంకటేశ్‌ ఇంటి పైకప్పు లేచిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సుమారు 3 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. సిబ్బంది అర్ధరాత్రి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేసి సరఫరాను పునరుద్ధరించారు.

విగ్రహ నిర్మాణ స్థలం పరిశీలన

రామగుండం: బైపాస్‌ రోడ్డు ఎదుట రామునిగుండాల కొండపై నిర్మిస్తున్న పంచముఖ హనుమాన్‌ విగ్రహ పనుల ప్రగతిని మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు ఆదివారం సందర్శించారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌ విగ్రహ ప్రత్యే కత గురించి వివరించారు. మేయర్‌ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు సిరిశెట్టి సతీశ్‌, ఇసంపెల్లి అంజయ్య తదితరులు ఉన్నారు.

డిప్యూటీ సీఎం సానుకూలం

గోదావరిఖని: సింగరేణి మారుపేర్ల, విజిలెన్స్‌ పెండింగ్‌ కేసుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకుడు శ్రావణ్‌గౌడ్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశామని ఆయన ఆదివారం పేర్కొన్నారు.

ఐక్యంగా ఉంటూ ఎదుగుదాం

పెద్దపల్లిరూరల్‌/పెద్దపల్లి: ఐక్యంగా ఉంటూ అన్నిరంగాల్లో ఎదగాలని, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుఠం పురుషోత్తం అన్నారు. పట్టణంలో ఆదివారం జరిగిన స మావేశంలో మాట్లాడారు. నాయకులు మల్క రామస్వామి, ఎలువాక రాజ య్య, అమిరిశెట్టి రామస్వామి, తూముల శ్రీనివాస్‌, ఆకుల మ హేందర్‌, బిరుదు కృష్ణ, ఎడెల్లి శంకర్‌, బండా రి రామ్మూర్తి, గంట రమేశ్‌, వునుకొండ శ్రీధ ర్‌, వివేక్‌పటేల్‌, వెంకన్న, హరిశంకర్‌, పూదరి మహేందర్‌, కొట్టెరవి, శ్రీధర్‌ ఉన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా జడల సురేందర్‌

మున్నూరు కాపుసంఘ జిల్లా అధ్యక్షుడిగా జ డల సురేందర్‌ ఎన్నికయ్యారు. ఈమేరకు రా ష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం తదితర నాయకుల నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement