ఆదివారం.. వైద్యసేవలకు తాళం | - | Sakshi
Sakshi News home page

ఆదివారం.. వైద్యసేవలకు తాళం

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

కోల్‌సిటీ(రామగుండం): వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రాథమి ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలంటున్నారు. కా నీ, సెలవు రోజుల్లో పీహెచ్‌సీలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘సాక్షి’ ఆదివారం ఉదయం విజిట్‌ చేయ గా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

జాడలేని వైద్య సిబ్బంది

గోదావరిఖని అడ్డగుంటపల్లి, జనగామ, ఫైవ్‌ ఇంక్లయిన్‌ కృష్ణానగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు కాదు.. తాళాలు వేసిన గేట్లే దర్శనమిచ్చాయి. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆస్పత్రులు మూసి ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. వైద్యులు, సిబ్బంది జాడకనిపించలేదు.

గోడలకే పరిమితమైన నిబంధనలు

సెలవు రోజుల్లోనూ వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదివారం, సెలవు రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వైద్యసేవలు అందించాలని ఆదేశించింది. అడ్డగుంటపల్లి యూపీహెచ్‌సీ గోడలపై ఇవే విషయాలను అధికారులు బోర్డు కూడా రాసిపెట్టారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ర్తిగా భిన్నంగా కనిపించింది. మూడు ఆస్పత్రులకు వేసిన తాళాలను కనీసం గంటపాటు కూడా తీయలేదు.

సండే సెలవంటా..

ఆస్పత్రి సిబ్బందిని ఫోన్‌లో సంప్రదించి, ‘ఆదివారం మధ్యాహ్నం వరకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా ఎందుకు మూసివేశారు?’ అని ప్ర శ్నించగా, కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారు. ‘ఆదివారం సెలవు కదండీ.. అందుకే తెరవలేదు. ఆస్పత్రికి ఆదివారం సెలవు అని అందరికీ తెలుసు’ అంటూ సమాధానం ఇచ్చారు.

క్షేత్రస్థాయిలో తాళాలు

ఆదివారం వైద్యసేవలకు సెలవు

గోడలకే పరిమితమైన నిబంధనలు

‘సాక్షి’ విజిట్‌లో వెలుగులోకి..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement