గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట్ల ఓ ట్లు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కుట్ర పన్నిందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అధ్యక్షతన ఎన్టీపీసీ లో ఆదివారం జరిగిన సమావేశంలో మంత్రి మా ట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష ప్రభుత్వాలను లక్ష్యంగా చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రల కు కేంద్రప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ‘ఎస్‌ఐఆర్’ ఒకపెద్ద భూతం లాంటిదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ, వచ్చే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. పె ద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ విజయరమణరావు, సలహదారు హర్కర వేణుగోపాల్‌రావు, దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడారు. ఎస్‌ఐఆర్ శిక్షణ జిల్లా ఇన్‌చార్జి సురేశ్ షట్కార్, మినరల్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఇరావర్తి అనిల్, లైబ్రరీ చెర్మన్ రియా జ్, బూత్‌స్థాయి ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, మేయర్ మహంకాళిస్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, పెద్దపల్లి కాంగ్రెస్ జిల్లా కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
వేగంగా చెరువు పునరుద్ధరణ పనులు
మంథని: వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో చెరువు పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. మంథని రావులచెరువుకట్ట పనుల పురోగతిని తనిఖీ చేశారు. పనుల తీరుపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ప్రతినిధులు శశిభూషణ్‌కాచే, మారుపాక నిహారిక, జంబోజు శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలంగా ఉన్నచోట దృష్టి
ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


