పెద్దపల్లిరూరల్/ఎలిగేడు: పెద్దపల్లి నియోజకవర్గంలోని కొత్త పోలీస్‌స్టేషన్లకు సొంత భవనాలు నిర్మి స్తామని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపా రు. అనువైన స్థలాలు ఎంపిక చేసేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో ఆదివారం పెద్దపల్లి, ఎలిగేడులో స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్ సమీపంలోని ట్రా ఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మహిళా, బందంపల్లి సమీపంలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు స్థలాలు పరిశీలించారు. ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు, నాయకుడు సంతోష్‌రావు పాల్గొన్నారు.


